మాజీ ప్రధాని, తెలుగు జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలోని పీవీ నరసింహారావు విగ్రహం వద్ద పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని పూలమాలవేసి నివాళులర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి పీవీ నరసింహారావు అని కొనియాడారు. దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు ఆద్యుడైన పీవీ.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ..
సత్యనారాయణ పురంలోని కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఎంపీ కాశినేని నాని పాల్గొని.. ప్రత్యేక పూజలు చేశారు. మచిలీపట్నంలో పీవీ నరసింహారావు విగ్రహానికి తెదేపా నాయకులు ఘన నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా తెలుగువాని కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటిచెప్పిన మహామేథావి పీవీ అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు.