రైతులతో కలిసి శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సమయంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరుపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రైతులతో కలిసి శాంతియుతంగా నిరసన చేస్తుండగా పోలీసులు లాఠీఛార్జి చేశారని, రాళ్లు విసిరారని ఆరోపించారు. తనకు పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు కాబట్టి నిరసన చేసుకునే హక్కు ఉందన్నారు. అసెంబ్లీ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తుంటే... పోలీసులు దారుణంగా ప్రవర్తించారన్నారు. పోలీసులు తనపైనా లాఠీఛార్జ్ చేయబోతే ...రైతులు, మహిళలు కాపాడారని తెలిపారు. గ్రామీణ ఎస్పీ విజయరావు లాఠీతో పరుగెత్తుకుని వచ్చారని... తనని కూడా కొడతారని భయపడ్డానని వివరించారు.