ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా సహకారం అందించాలి' - కొవిడ్ నియంత్రణకు చర్యలు న్యూస్

రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న చర్యలకు, స్వచ్ఛంద సంస్థలకు, సహకారం అందిస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని మంత్రి కొడాలి నాని అన్నారు. దాతలు ముందుకు వచ్చి.. స్వచ్ఛందంగా.. తమ వంతు సహకారం అందించాలని ఎంపీ బాలశౌరి పిలుపునిచ్చారు.

'దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా సహకారం అందించాలి'
'దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా సహకారం అందించాలి'

By

Published : May 27, 2021, 1:15 PM IST

గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని కొవిడ్‌ కేంద్రానికి 'లివ్ ఫర్ లాఫర్' సంస్థ ఆధ్వర్యంలో ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు, ఆక్సీమీటర్లు, మెడికల్ కిట్లను ఎంపీ బాలశౌరితో కలిసి కొడాలి నాని అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం హాస్పిటల్​లో కొవిడ్ వైద్యం, రోగులకు అందుతున్న సౌకర్యాలపై సమీక్ష చేశారు.

అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కొవిడ్‌ మహమ్మారి నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషికి ఇతర రాష్ట్రాలతోపాటు ప్రధానమంత్రి సైతం అభినందిస్తున్నారని అన్నారు. కొవిడ్ నియంత్రణపై ప్రభుత్వ కృషికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించిన వారిని ఎంపీ బాలశౌరి అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details