తెలుగు సినిమా ప్రియులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లో జులై 31వ తేదీ నుంచి థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు తెరుచుకోవచ్చని పేర్కొంది. దీంతో శనివారం నుంచి థియేటర్లలో సందడి మొదలు కానుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ జులై 8వ తేదీ నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని చెప్పినప్పటికీ ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య తలెత్తిన వివాదం కారణంగా థియేటర్లు తెరచుకోలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చింది. శానిటైజర్లు, సామాజిక దూరం, మాస్కులు వంటి కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడిపించాలని ప్రభుత్వం సూచించింది. అయితే, 50శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు నడపటం తమకు నష్టమని థియేటర్ యజమానుల చెబుతున్నారు.