Mother Murdered by Son: తనకు పెళ్లి చేయట్లేదన్న కోపంతో ఓ కుమారుడు. ఏకంగా తన తల్లినే హతమార్చాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. శంకర్రాజు, వెంకటేశ్వరమ్మ దంపతులు.. మచిలీపట్నంలోని పరాసుపేటలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న పెద్ద కుమారుడు. తనకు పెళ్లి చేయాలంటూ తరచూ తల్లితో గొడవ(Son Kills Mother at parasupeta) పడేవాడు.
Mother Murdered by Son: పెళ్లి చేయట్లేదన్న కోపంతో.. తల్లిని హతమార్చిన కొడుకు - తల్లిని చంపిన కొడుకు వార్తలు
కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పరాసుపేటలో దారుణం(Mother Murdered by Son) చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయట్లేదనే కోపంతో.. ఓ కొడుకు క్రికెట్ బ్యాట్‌తో కొట్టి తల్లిని హతమార్చాడు.
తల్లిని హత్య చేసిన కొడుకు
ఇటీవల వచ్చిన సంబంధం కూడా ఆమె వల్లే తప్పిపోయిందనే కోపంతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో క్రికెట్ బ్యాట్‌తో తలపై బలంగా కొట్టి(Son Beat Woman To Death at Krishna district) పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వెంకటేశ్వరమ్మను.. భర్త శంకర్రాజు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Nov 26, 2021, 9:18 AM IST