ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్న కొడుకును కడతేర్చిన కసాయి తల్లి... ఎందుకంటే.. - జగ్గయ్యపేటలో కొడుకునే చంపేసిన తల్లి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో... వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ తల్లి, ప్రియుడితో కలిసి కన్నకొడుకుని కడతేర్చింది. వారి ఏకాంతానికి అడ్డువస్తున్నారని బాలుడిని చంపేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

mother kills her son due to illegal affair at jaggaiahpeta in krishna district
కన్న కొడుకును కడతేర్చిన కసాయి తల్లి

By

Published : Oct 8, 2020, 7:30 PM IST

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం సమీపంలోని మానుకొండ గ్రామానికి చెందిన ఉష, ప్రసాద్‌లు దంపతులు. వీరు తాపీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. వారికి ఇద్దరు పిల్లలు సుకుమార్‌ (4), అంకిత్‌ (18నెలలు)ఉన్నారు. ఉషకు కొణిజర్ల మండలం రామనర్సానగర్‌కు చెందిన సంపంగి శ్రీను అలియాస్‌ శివతో పనులు చేసే చోట పరిచయం ఏర్పడింది. అతనికి గతంలోనే వివాహమైంది..ఆమె భర్తను, అతడు భార్యను వదిలేసి ఇద్దరూ రెండు నెలల క్రితం జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామం వచ్చి అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. పిల్లలు ఇద్దరూ వారి వద్దే ఉంటున్నారు. ఈ నెల 4వ తేదీన రాత్రి పిల్లలు అల్లరి చేస్తున్నారని ఆగ్రహానికి గురై ప్రియుడితో కలిసి తీవ్రంగా కొట్టింది. ఆ దెబ్బల దాటికి అంకిత్‌కు మూర్ఛ వచ్చి పడిపోయి కొద్దిసేపటికి మృతి చెందాడు. పిల్లలకు జ్వరం వచ్చింది..ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని స్థానికులతో నమ్మబలికి పిల్లలతో కలిసి ఇద్దరూ ఆటోలో బయలుదేరారు.

అంకిత్‌, సుకుమార్‌ల పాతచిత్రం

యజమాని ఆరాతో : ఆ ఇద్దరూ మరుసటి రోజు కూడా తిరిగి రాకపోవడంతో ఇంటి యజమానికి వారిపై అనుమానం వచ్చింది. స్థానిక వీఆర్వోతోపాటు, పోలీసులకూ సమాచారమిచ్చారు. ఈ మేరకు చిల్లకల్లు ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేట్టారు.

సిగ్నల్‌ ఆధారంగా:రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరిని సెల్‌ఫోన్‌ టవర్‌ సిగ్నల్‌ ఆధారంగా బుధవారం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని తన దైన శైలిలో విచారించడంతో అసలు విషయం చెప్పారు. బాలుడి మృతదేహాన్ని కోదాడ మండలం చిలుకూరు గ్రామ సమీపంలోని గుట్టల వద్ద భూమిలో పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. సుకుమార్‌ కాళ్లను అట్లకాడతో కాల్చడంతో తీవ్రంగా గాయాలైనట్లు గుర్తించారు.

భారీగా చరవాణులు:వారిద్దరూ అద్దెకు ఉంటున్న ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా 40 సెల్‌ఫోన్లు లభ్యమయ్యాయి. నిందితుడు శివ సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నట్లు వారు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి:

చౌక బియ్యం మార్చి.. ఏమార్చి

ABOUT THE AUTHOR

...view details