ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యానికి బానిసైన కుమారుడు.. హతమార్చిన కన్నతల్లి

మద్యం.. ఈ మహమ్మారి కారణంగా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. తాగీతాగీ చనిపోయేవారు కొందరైతే.. ఆ అలవాటు మానుకోలేక సొంతవారి చేతిలోనే మరణిస్తున్న వారు మరికొందరు. తాగుడుకు అలవాటు పడిన కొడుకు విషయంలో సహనం కోల్పోయిన ఓ తల్లి కన్నకొడుకునే హతమార్చిన ఘటన కృష్ణా జిల్లా బొమ్మలూరులో జరిగింది.

mother killed son in bommaluru krishna district
తల్లి చేతిలో హతమైన కుమారుడు

By

Published : Jul 17, 2020, 12:14 PM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరులో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన కొడుకును కన్నతల్లి హతమార్చింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆనందబాబు తాగుడుకు అలవాటుపడ్డాడు. మద్యానికి డబ్బులకోసం తరచూ తల్లిని వేధించేవాడు. ఆ అలవాటు మానుకోమని ఎన్నిసార్లు చెప్పినా అతను వినలేదు.

గత రాత్రి ఇదే విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది తారస్థాయికి చేరి సహనం కోల్పోయిన ఆనందబాబు తల్లి ఇంట్లో ఉన్న వస్తువులతో అతనిపై దాడి చేసింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details