ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరోగ్యం కోసం అమ్మల ర్యాంప్​ వాక్​ - గర్భిణులు,పాలిచ్చే తల్లులు

తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పురిటి బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో తెలియజేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి రూట్స్ హెల్త్ ఫౌండేషన్​ సైతం ముందుకొచ్చింది. విజయవాడలోని ట్రెండ్​సెట్ మాల్​లో గర్భిణులు, తల్లులకు ర్యాంప్​వాక్​ నిర్వహించారు.

ర్యాంప్​వాక్​ చేస్తున్న గర్భిణీలు ,తల్లులు

By

Published : Aug 4, 2019, 1:14 PM IST

ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే విజయవాడ నగరంలో తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మోప్మా సైతం ఈ కార్యక్రమానికి సహకారం అందించింది. బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న ట్రెండ్ సెట్ మాల్​లో గర్భిణులు, పాలిచ్చే తల్లులతో ర్యాంప్ వాక్ నిర్వహించారు. స్థానిక మహిళలతో పాటు మెప్మా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం 6 నెలల పాటు తల్లిపాలు ఇస్తే బిడ్డలో వ్యాధినిరోధక శక్తి పెరుగతుందని అంతే కాకుండా పాలిచ్చే తల్లులు రొమ్ము క్యాన్సర్​ బారిన పడకుండా ఉంటారని వైద్యనిపుణులు వెల్లడించారు. తల్లిపాల విశిష్టతను తెలియజేస్తూ.. ప్లకార్డులు చేతబట్టుకుని గర్భిణులు, పాలిచ్చే తల్లులతో రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సభ్యులు చేయించిన ర్యాంప్ వాక్ విశేషంగా ఆకట్టుకుంది.

ర్యాంప్​వాక్​ చేస్తున్న గర్భిణీలు ,తల్లులు

ABOUT THE AUTHOR

...view details