Mother and children missing: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లితోపాటు ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆసుపత్రిలో డెలివరీ కోసం చేరిన బాలింత సహా తన ముగ్గురు పిల్లలు.. మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి కనిపించడం లేదని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దగ్గరలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. గుర్తుతెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.
ఆసుపత్రి నుంచి.. తల్లీముగ్గురు పిల్లలు అదృశ్యం..! - ఆసుపత్రి నుంచి తల్లీ ముగ్గురు పిల్లలు అదృశ్యం వార్తలు
10:28 June 01
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘటన
మచిలీపట్నంలోని దేశాయిపేటకు చెందిన ఆనంద్కు ఇద్దరు పిల్లలు ఉండగా.. మూడవ కాన్పు కోసం భార్యను జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. మే 21న భార్యను ఆసుపత్రిలో చేర్చగా.. అదే రోజు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డతోపాటు.. మిగిలిన ఇద్దరు పిల్లలు కూడా తల్లి వద్దే ఉన్నారు. పిల్లలను తల్లి వద్దనే ఉంచిన ఆనంద్.. ఇంటివద్ద పనులు చేసుకునేందుకు వెళ్లాడు.
మంగళవారం కూడా ఇంటికి వెళ్లిన ఆనంద్.. సాయంత్రం ఆసుపత్రి వద్దకు వచ్చి చూడగా.. భార్యా, ముగ్గురు పిల్లలు కనిపించలేదు. కంగారుగా ఆసుపత్రి మొత్తం వెతికినప్పటికీ వారి జాడ కనిపించలేదు. దీంతో.. ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: