అతడు వృత్తి రీత్యా పోలీసు... కానీ ప్రవృత్తి నేరాలు చేయటం. అతడే కానిస్టేబుల్ పడాల్...ఇతని పేరు చెపితే చాలు పోలీసులు సైతం ఉలిక్కిపడతారు. తాజాగా గంజాయి కేసులో చిక్కిన పడాల్...జైలుకు తరలిస్తున్నప్పుడు పరారయ్యాడు. నిందితుడిని గాలించేందుకు 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
పడాల్ కేసు దర్యాప్తులో ఎన్నో నిజాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. నేరాల చిట్టా ఒక్కొక్కటిగా బయట పడుతోందని తెలిపారు. విశాఖ జిల్లా చింతపల్లి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేసినప్పుడు ఎసై తుపాకీ అపహరించాడు. దానితో బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని విచారణలో తేలింది. గంజాయి స్మగ్లర్ల, మావోయిస్టులతో సత్ససంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖ, ఒడిశా సరిహద్దుల్లో పని చేసినందున రెండు మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడని చెపుతున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.