వైఎస్సార్ చేయూత పథకానికి 24,52,427 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో బీసీలు 14,81,947 మంది, ఎస్సీలు 5,80,488, మైనారిటీలు 2,36,375, ఎస్టీలు 1,47,309 మంది చొప్పున ఉన్నారు.
ఈ పథకం కింద అర్హులైన 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లపాటు ఆర్థిక సాయాన్ని అందిస్తారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆగస్టు 12న ప్రభుత్వం నగదు జమ చేయనుంది.