కృష్ణా జిల్లా మోపిదేవిలోని ఆలయం నాగులచవితి ఉత్సవాలకు ముస్తాబైంది. వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో.. రేపు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఉదయం 2 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. పుట్టలో పాలు పోసిన అనంతరం.. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్వామివారిని దర్శించుకోనున్నారు.
స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ లీలా కుమార్ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవనిగడ్డ పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం.. విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం ఆర్టీసీ డిపోలు బస్సులు నడపనున్నాయని పేర్కొన్నారు.