ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు ఇకనైనా కుట్ర రాజకీయాలు మానుకోవాలి: మోపిదేవి - చంద్రబాబు ఇకనైనా కుట్ర రాజకీయాలు మానుకోవాలి

హత్యకు గురైన వైకాపా నేత మోకా భాస్కర్​రావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. మంత్రి పేర్ని నానితో కలిసి మోకా కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

చంద్రబాబు ఇకనైనా కుట్ర రాజకీయాలు మానుకోవాలి: మోపిదేవి
చంద్రబాబు ఇకనైనా కుట్ర రాజకీయాలు మానుకోవాలి: మోపిదేవి

By

Published : Jul 6, 2020, 5:08 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హత్యకు గురైన మోకా భాస్కర్​రావు కుటుంబాన్ని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, మంత్రి పేర్నినాని పరామర్శించారు. మోకా కుటుంబానికి వైకాపా పూర్తి అండగా ఉంటుందని ఎంపీ మోపిదేవి తెలిపారు. హత్య కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

బీసీలను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబు.. మోకా భాస్కర్​రావు కూడా బీసీ అనే సంగతి గుర్తుంచుకోవాలని మోపిదేవి సూచించారు. చంద్రబాబు ఇప్పటికైనా కుట్ర రాజకీయలు మానుకోవాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details