కృష్ణాజిల్లా దివిసీమలో వానరాలకు ఆహారం లేక విలవిల లాడుతున్నాయి. లాక్ డౌన్ వలన ప్రజలు ఇంటి దగ్గరే ఉండటంతో కోతులను గ్రామంలోకి రాకుండా చేస్తున్నారు. అవనిగడ్డ మండలం, రామచంద్రాపురం, వెకనూరు గ్రామ శివారులో వందల వానరాలు ఆకలితో అలమటిస్తున్నాయి. కొందరు జంతు ప్రేమికులు వాటికి బొప్పాయి, కొబ్బరి, అరటి కాయలు వేసి వాటి ఆకలి తిరుస్తున్నారు. అసలే వేసవికాలం కావడంతో తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వానరాలు వెళుతున్నాయి. మోపిదేవి మండలం, వెంకటాపురం గ్రామంలో వందల కోతులు ఆహారం లేక అలమటిస్తున్నాయి.
లాక్ డౌన్ ఎఫెక్ట్ :మూగజీవులు ఆకలి వేదన
లాక్ డౌన్ కారణంగా ప్రజలే కాదు..మూగజీవులు సైతం ఆకలితో అలమటిస్తున్నాయి.ఆలయాల ముందు భక్తులు పెట్టిన ప్రసాదం తినే వానరాలు నేడు తిండిలేక బిక్కుబిక్కుమంటున్నాయి.కంటినీరు తుడుస్తూ పిల్లకు పాలిస్తున్న కోతిని చూస్తే జంతు ప్రేమికులు మనసు చలించిపోతుంది.
monkeys facing problems due to lockdown no food and no water