ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చరవాణి హ్యాక్​ చేశారు.. రూ.7 లక్షలు దోచేశారు.. - విజయవాడలో సైబర్​ మోసాల వార్తలు

మేం సైబర్​ క్రైం పోలీసులం.. మీ నంబరు నుంచి మహిళలను వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని ఓ వ్యక్తిని సైబర్​ మోసగాళ్లు బెదిరించారు. భయపడిన అతను వారు చెప్పినట్లు చరవాణిలో కాంటాక్ట్​, యాప్​లు ఇన్​స్టాల్​ చేశాడు. అనంతరం వ్యక్తి ఖాతాల్లోని మొత్తం రూ.7 లక్షలు దోచేశారు. ఎంతో చాకచక్యంగా చరవాణి హ్యాక్​ చేసి నడిపిన ఈ మోసంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ మాచవరంలో జరిగిన ఘటన వివరాలివి.

చరవాణి హ్యాక్​ చేశారు.. రూ.7 లక్షలు దోచేశారు..

By

Published : Nov 23, 2019, 5:31 AM IST

చరవాణి హ్యాకింగ్​తో నగదు చోరీ
విజయవాడలో సైబర్​ మోసగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఓ వ్యక్తిని బెదిరించి అతని చరవాణిలో నకిలీ యాప్​లు ఇన్​స్టాల్​ చేయించి 7 లక్షల 71 వేల 388 రూపాయలు కాజేశారు. మొత్తం ఐదు విడతల్లో నగదు చోరీ చేసి విమాన టిక్కెట్లు కొనుగోలు చేశారు. అనంతరం వీటిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ జరిగింది

విజయవాడ మాచవరానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం అతని చరవాణికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. దిల్లీ సైబర్ క్రైం పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. మీ నంబరు నుంచి పలువురి మహిళలను వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని మీ చిరునామా చెప్పండంటూ దబాయించారు. భయపడిన బాధితుడు తనకు ఏమీ తెలియదని చెబుతుండగా.. వారికి కావాల్సిన వివరాలను సేకరించడం మొదలు పెట్టారు. నంబరును ఎవరో క్లోనింగ్ చేసి వినియోగిస్తున్నారని.. దీన్ని అడ్డుకోవాలంటే మేం చెప్పినట్లు చేయాలంటూ నమ్మించారు. నంబరును ఆండ్రాయిడ్​ ఫోన్లో వేయమని చెప్పి నకిలీ యాప్​, కాంటాక్ట్​లు ఇచ్చి ఇన్​స్టాల్​ చేయమని సూచించారు. సేవ్​ చేసుకున్న చరవాణి నంబర్లను బ్లాక్​ చేసుకుంటే ఇబ్బందులుండవని చెప్పారు. కేవలం గంట సమయంలోనే చాకచక్యంగా తతంగాన్ని నడిపి నగదు దోచేశారు.

ABOUT THE AUTHOR

...view details