మోదీది హిట్లర్ పాలన : నాగుల్ మీరా - police housing corporation chairman
వైకాపా, భాజపాలు చీకటి ఒప్పందాలతో కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగుల్ మీరా ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. మోదీ పాలన మరో హిట్లర్ పాలనను తలపిస్తుందని ఎద్దేవా చేశారు.
![మోదీది హిట్లర్ పాలన : నాగుల్ మీరా](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2690053-707-c7bf435b-e704-47bb-ae5e-7d9962d26355.jpg)
వైకాపా, భాజపాలు చీకటి ఒప్పందాలతో కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగుల్ మీరా ఆరోపించారు. విజయసాయి రెడ్డి మోదీకి, వైకాపాకి మధ్య వారథిలా వ్యవహరిస్తున్నారన్నారు. మైనార్టీలపై భాజపా కక్ష సాధింపు చర్యలు దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలన మరో హిట్లర్ పాలనను తలపిస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. జగన్ కు ఓటువేస్తే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి పాలన చేస్తోన్నారని విమర్శించారు. లోకేశ్ మంగళగిరి నుంచి అత్యధిక మెజారిటీతో గెలుస్తారన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. తెదేపా పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ అన్నారు.