సముద్ర ఆహార ఉత్పతుల విక్రయాలకు మత్స్యశాఖ రిటైల్ దుకాణాలకు శ్రీకారం చుట్టింది. ఇదివరకు శాకాహారుల కోసం రైతు బజార్లు ఉన్నట్టుగానే... విజయవాడ శివారులోని గంగూరు వద్ద మత్స్యవిపణి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా నిత్యం వివిధ రకాల చేపలు, పీతలు, రొయ్యలను విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు అందించడం ఈ విపణి ఉద్దేశం. రాష్ట్రంలోని ఆక్వా ఉత్పత్తుల్లో కనీసం 30 శాతం ఉత్పత్తులను స్థానికంగా రిటైల్ రంగం ద్వారా ప్రజలకు చేరువ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. కరోనా వల్ల ఎగుమతులకు ఆటంకాలు ఎదురవుతుండటం వల్ల.... మత్స్య సంపదను మరింత లాభసాటిగా మార్చి... స్థానిక మార్కెట్లను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగానే ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే విజయవాడలో మరో రెండు రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు మత్స్య శాఖ అధికారి తెలిపారు.
పరిశుభ్రమైన వాతావరణంలో...