ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరేగా నిధులు విడుదల చేయాలని.. గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు - mlc rajendra prasad on narega funds

నరేగా నిధులు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద నిరసన చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు.

MLC Rajendra Prasad on narega funds
ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

By

Published : Oct 2, 2020, 10:01 AM IST

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల బకాయిలు విడుదల జాప్యంపై నేడు రాష్ట్రవ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద నిరసన చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. గత రెండేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన 2500కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరితో పలువురు అప్పులపాలై, వడ్డీలు కట్టలేక ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మహాత్మాగాంధీ ఉపాధి హామీ అని పేరు పెట్టిన పథకానికే రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. నరేగా నిధుల బకాయిలు చెల్లించమని కేంద్రం విడుదల చేసిన రూ.1860కోట్లు ఇతర పథకాలకు మళ్లించారని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. బకాయిలు చెల్లించే వరకు పంచాయతీ రాజ్ ఛాంబర్ తరపున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: బాపూ నడయాడిన నేల... మన రాజమహేంద్రవరం

ABOUT THE AUTHOR

...view details