ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం' - ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తాజా వార్తలు

జగన్​మోహన్ రెడ్డి రెండేళ్ల పరిపాలనలో అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఒక చేత్తో సంక్షేమం అంటూ డబ్బులు ఇస్తూ.. దానికి రెండింతలు పన్నుల భారం ప్రజలపై వేస్తూ డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్
ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్

By

Published : May 26, 2021, 10:51 PM IST

జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ల పరిపాలనలో అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్సీ వైవీ బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. కేవలం రూ.5 వేలు, రూ.10 వేలు ఇచ్చి దాన్నే అభివృద్ధి అనుకోవడం జగన్ రెడ్డి అవివేకమన్నారు. ఒక చేత్తో సంక్షేమం అంటూ డబ్బులు ఇస్తూ, దానికి రెండింతలు పన్నుల భారం ప్రజలపై వేస్తూ డబ్బులు వసూళ్లు చెయ్యడం నిజం కాదా అని ప్రశ్నించారు.

ఇసుక, మద్యం మాఫియాలను జగన్ రెడ్డి పెంచి పోషిస్తూ బినామీలకు వేల కోట్లు దోచి పెడుతున్నారని ఆరోపించారు. పేదలకు ఇళ్లపట్టాల పేరుతో ఒక సెంటు భూమి ఇస్తున్నామని చెప్పి, రాష్ట్రవ్యాప్తంగా జగన్ రెడ్డి మంత్రులకు, ఎమ్మెల్యేలకు కోటాను కోట్ల రూపాయలు అక్రమంగా కట్టబెట్టారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 18,285 కరోనా కేసులు, 99 మరణాలు

ABOUT THE AUTHOR

...view details