విద్యార్థులు, వారి తల్లిదండ్రులే పరీక్షలు రద్దు చేయాలంటుంటే ముఖ్యమంత్రి మొండిగా పరీక్షలు నిర్వహిస్తామనటం సరికాదని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మండిపడ్డారు. 10వ తరగతి పాసవ్వని మంత్రులు కూడా పదవ తరగతి పరీక్షలు గురించి మాట్లాడడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా 16 రాష్ట్రాలు సీబీఎస్ఈ పది, 12 తరగతులను పరీక్షలను రద్దుచేశాయని గుర్తు చేశారు.
మరోవైపు.. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని ఓ వైపు నిపుణులు హెచ్చరిస్తుంటే... ఇలాంటి సమయంలో విద్యార్థుల ప్రాణాలు ఫణంగా పెట్టి పరీక్షలు నిర్వహించడం అవసరమా? అని మంతెన ప్రశ్నించారు. పరీక్షలు రద్దు చేస్తారా? లేక విద్యార్థులనే పరీక్షలు బహిష్కరించమంటారాని నిలదీశారు. తక్షణమే పది, ఇంటర్ పరీక్షలు రద్దుచేయాలని డిమాండ్ చేశారు.