సొంత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటనకు వెళ్లారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. కేసుల భయంతో రాష్ట్ర పరువు, ప్రజల ఆత్మగౌరవాన్ని హస్తిన వీధుల్లో తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు దిల్లీకి వెళ్లి ఉంటే... కేంద్ర ఆర్థిక మంత్రిని సీఎం ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు.
'సొంత ప్రయోజనాల కోసమే సీఎం జగన్ దిల్లీ పర్యటన' - సీఎం జగన్ దిల్లీ పర్యటన వివాదం వార్తలు
ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు హస్తినకు వెళ్లి ఉంటే... కేంద్ర ఆర్థిక మంత్రిని సీఎం ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు.
!['సొంత ప్రయోజనాల కోసమే సీఎం జగన్ దిల్లీ పర్యటన' mlc deepak reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8940680-33-8940680-1601053487935.jpg)
ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ధైర్యం వైకాపా ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోందని దీపక్ రెడ్డి నిలదీశారు. మరోవైపు ముఖ్యమంత్రి స్థానంలో జగన్ తిరుమల వచ్చినప్పుడు... ఆలయ ఈవో, జేఈవోలు చట్ట ప్రకారం డిక్లరేషన్‌లో సంతకం పెట్టాలని ఆయన్ని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామి కన్నా జగన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని వ్యాఖ్యానించారు.