విజయవాడ తెదేపాలో వర్గ విభేదాలకు చెక్ పెట్టే దిశగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు చేపట్టారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్లో అభ్యర్థి ఎంపికపై ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గాల మధ్య గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఇప్పటికే ఇరువర్గాలతో చర్చలు జరిపారు. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలను పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు పిలిపించి సమావేశమయ్యారు.
ఎంపీ నానితో కలిసి నడవలేని ఇబ్బందులేమీ లేవని బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబుతో పార్టీ విషయాలన్నీ చర్చించినట్లు తెలిపారు. చంద్రబాబు ఏం చెప్పినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.