సీఎం జగన్ తుంగభద్ర పుష్కరాల కోసం విడుదల చేసిన 250 కోట్ల రూపాయలను.. పనులు చేయకుండా మింగేశారని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ ఆరోపించారు. పుష్కరాల నిర్వహణలో ఈ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని మమ అనిపిస్తుండటంతో భక్తులు లేక ఘాట్లు బోసిపోతున్నాయన్నారు. భక్తుల మనోభావాలు పట్టనట్లు సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాల రద్దీపై ఆశలు పెట్టుకున్న చిరు వ్యాపారులు నష్టపోయినందున వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
' భక్తుల మనోభావాలు పట్టనట్లు సీఎం వ్యవహరిస్తున్నారు' - సీఎం జగన్పై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ విమర్శలు వార్తలు
ముఖ్యమంత్రి జగన్పై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్