ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP: 'రైతు ద్రోహిగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు' - రైతునేస్తం

ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఎండగట్టారు. రైతుల ద్రోహిగా ముఖ్యమంత్రి జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. రైతు నేస్తం పథకాన్ని తప్పుదోవ పట్టించారని విమర్శించారు.

MLC Bachula Arjunudu fired on CM Jagan about farmers issues in AP at TDP Telugu Raithu
రైతు ద్రోహిగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు - బచ్చుల అర్జునుడు

By

Published : Sep 16, 2021, 7:15 PM IST

ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఎండగట్టారు. రైతుల ద్రోహిగా ముఖ్యమంత్రి జగన్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. రైతు నేస్తం పథకాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రైతులకు సబ్సీడీ ఇవ్వకపోగా.. రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతును కాపాడలేని వైకాపా ప్రభుత్వం తిరోగమనం వైపు పయనిస్తోందన్నారు. రైతు కోసం తెలుగుదేశం పేరిట ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని బచ్చుల అర్జునుడు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా కార్యాలయంలో జరిగిన తెలుగు రైతు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దక్షిణ కోస్తా, సీమ జిల్లా రైతుల సమస్యలపై తెదేపా ఓ వీడియోను విడుదల చేసింది. గురువారం ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో జరగనున్న రైతు కోసం తెలుగుదేశం నిరసనలో భాగంగా ఆయా ప్రాంతాల రైతు సమస్యలను వీడియో ద్వారా వెల్లడించింది. పొగాకు, సుబాబుల్, జామాయిల్, ఉల్లి, టమాటా, మిరప, బత్తాయి రైతు ఇబ్బందులపై ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే రైతు సమస్యలు పెరిగిపోయాయని విమర్శించింది.

ఇదీ చదవండి : మతప్రచారాలను తొలగించకపోతే ప్రతిఘటనే - సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details