అవినీతిరహిత పాలన చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైకాపా ప్రభుత్వం... మంత్రి బాలినేని శ్రీనివాస్‌ని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని తెదేపా ప్రశ్నించింది. ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తే అక్రమ నగదు తరలింపు వ్యవహారంలో మంత్రిని అదుపులోకి తీసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు. బాలినేని శ్రీనివాన్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. మంత్రులు సొంత కార్లలో అక్రమంగా ఆర్థిక వనరులను తరలిస్తున్నారని.. ప్రభుత్వం బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తూ వారికి లైసెన్స్ ఇచ్చి మద్దతుతెలుపుతున్నారని ఆరోపించారు.
'బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి' - బాలినేని కారులో అక్రమ నగదు పట్టివేత
మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టబడిన ఘటనపై ఈడీ దర్యాప్తు చేయాలని తెదేపా నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు. మంత్రి వర్గం నుంచి బాలినేనిని బర్తరఫ్ చేయాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వనరులు మంత్రుల కార్లలో అక్రమంగా తరలిపోతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మంత్రిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బచ్చుల అర్జునుడు
అక్రమంగా తరలిస్తున్న రూ.5 కోట్ల 27లక్షల రూపాయల కేసుని ఈడీతో దర్యాప్తు చేయించాలని బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు. బాలినేని శ్రీనివాస్ కారు పట్టుపడ్డ వెంటనే.. కారు తనది కాదని మాట మార్చేశారని విమర్శించారు. చెన్నైలో ఉన్న వైఎస్ భారతి బంధువు సుధాకర్‌రెడ్డి ఇంటికి ఈ డబ్బు తరలిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి :కరోనా ఎఫెక్ట్: ప్రభుత్వ సేవలకు ఆటంకం