ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండలి సభ్యుడిగా అశోక్ బాబు ప్రమాణం - amaravati

శాసనమండలిలో ఎమ్మెల్సీగా అశోక్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ షరీఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. తెదేపా  నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎమ్మెల్సీగా అశోక్ బాబు ప్రమాణం

By

Published : Apr 17, 2019, 6:37 PM IST

ఎమ్మెల్సీగా అశోక్ బాబు ప్రమాణం

శాసనమండలిలో ఎమ్మెల్సీగా అశోక్ బాబు చేత మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రమాణం చేయించారు. మండలికి సంబంధించిన పుస్తకాలను అందజేశారు. అశోక్ బాబు ప్రమాణ స్వీకారానికి తెదేపా నేతలు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు... అశోక్ బాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి తెదేపా తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై తమ పార్టీ ఉద్యమం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details