ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రేషన్​ సరకుల పంపిణీకి సత్వర చర్యలు చేపట్టాలి' - ఎమ్మెల్సీ ఆశోక్ బాబు తాజా వార్తలు

రాష్ట్రంలో నిలిచిపోయిన రేషన్ సరుకుల పంపిణీకి సత్వర చర్యలు చేపట్టాలని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.

ఎమ్మెల్సీ అశోక్ బాబు
ఎమ్మెల్సీ అశోక్ బాబు

By

Published : May 4, 2021, 2:40 PM IST

ఎమ్మెల్సీ ఆశోక్​బాబు రాసిన లేఖ

రాష్ట్రంలో నిలిచిపోయిన రేషన్‌ సరుకుల పంపిణీకి సత్వర చర్యలు చేపట్టాలని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. దాదాపు 30 వేల మంది డీలర్లతో సాఫీగా నడిచే వ్యవస్థను ఇంటింటికీ రేషన్‌ పేరుతో నిర్వీర్యం చేశారని విమర్శిస్తూ... సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు.

రేషన్‌ సరుకుల పంపిణీ లేక... కరోనా సమయంలో పనులు లేక పేదలు అల్లాడుతున్నారని చెప్పారు. రేషన్‌ పంపిణీకి 769 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ... ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కరోనా తొలిదశలో 52 మంది డీలర్లు మరణించారని... వారికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details