ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'టిడ్కో ఇళ్లపై మంత్రి బొత్స చెప్పేవన్నీ అబద్ధాలే' - mlc ashok babu comments on tidco houses

టిడ్కో ఇళ్లపై మంత్రి బొత్స చెప్పేవన్నీ అబద్ధాలే అని.. కేంద్ర మంత్రి సమాధానంతో ఆ విషయం అర్థమయిందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. టిడ్కో ఇళ్లలో భారీ అవినీతి జరిగిందని చెప్పి.. లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతామని చెప్పారు.

MLC Ashok Babu
ఎమ్మెల్సీ అశోక్ బాబు

By

Published : Aug 5, 2021, 7:44 PM IST

టిడ్కో ఇళ్లపై మంత్రి బొత్స చెప్పేవి అన్నీ అబద్ధాలేనని నేడు కేంద్ర మంత్రి సమాధానంతో అర్థమైనట్టు.. తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. టిడ్కో ఇళ్లలో భారీ అవినీతి జరిగింది అని చెప్పి.. లబ్ధిదారులకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం... పేదవాడు మంచి ఇంట్లో ఉండకుండా చేసిందని ధ్వజమెత్తారు.

తెదేపా హయాంలో 10 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించామని అశోక్ బాబు గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలకు నేడు పడవలు వేసుకొని వెళ్లే పరిస్థితి ఉందని విమర్శించారు. లబ్ధిదారుల ఉసురు జగన్​కు కచ్చితంగా తగులుతుందని వ్యాఖ్యానించారు. కేంద్రం దృష్టికి టిడ్కో ఇళ్ల అంశాన్ని తీసుకెళతామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details