ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబటి రాంబాబు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: అశోక్ బాబు - tdp latest news

సొంతపార్టీ వారే అక్రమ మైనింగ్ కేసు పెట్టినందుకు.. వైకాపా నేత అంబటి రాంబాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. మూడు సార్లు ఓడి, రెండు సార్లు టిక్కెట్ దొరకని రాంబాబు.. తెదేపాను విమర్శించటం విడ్డూరంగా ఉందని అన్నారు.

mlc ashok babu
ఎమ్మెల్సీ అశోక్ బాబు

By

Published : Mar 31, 2021, 9:12 PM IST

సొంత పార్టీ వారే అక్రమ మైనింగ్ కేసు వేసినందున అంబటి రాంబాబు తన శాసన సభ్యత్వం వదులుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలో జరిగిన అక్రమ మైనింగ్​పై అంబటి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఎందుకు జరిమానా విధించలేదని న్యాయస్థానం ప్రశ్నించడం చూస్తే... అతను అక్రమ మైనింగ్​కి పాల్పడ్డారని హైకోర్టు నిర్ధారణకు వచ్చినట్లు స్పష్టమవుతోందన్నారు. ఒక్క సారి ఎమ్మెల్యే అయ్యాక మళ్లీ ఎమ్మెల్యే కావడానికి అంబటి రాంబాబుకి 25 ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. మూడు సార్లు ఓడి, రెండు సార్లు టిక్కెట్ దొరకని ఆయన.. తెదేపాని విమర్శించటం విడ్డూరంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details