ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిపాలన వికేంద్రీకరణ ఎక్కడా లేదు: ఎమ్మెల్సీ అశోక్​బాబు - ఎమ్మెల్సీ అశోక్​బాబు తాజా వార్తలు

తమిళనాడులో కారులో లభ్యమైన డబ్బు వ్యవహారంలో మంత్రి బాలినేని అడ్డంగా దొరికిపోయారని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. తనది కాని స్టిక్కర్ పై మంత్రి బాలినేని ఎందుకు కంగారుగా ముందే స్పందించారని ప్రశ్నించారు.

mlc ashok
mlc ashok

By

Published : Jul 18, 2020, 5:04 PM IST

మంత్రి బాలినేని వ్యవహారిస్తున్న తీరు అనుమానాలకు తావు ఇస్తోందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. తమిళనాడులో కారులో తరలిస్తున్న డబ్బు విషయంలో.. మంత్రి అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిని అరెస్టు చేయించటం దుర్మార్గమన్నారు. తనది కాని స్టిక్కర్ పై మంత్రి బాలినేని ఎందుకు కంగారుగా ముందే స్పందించారని ప్రశ్నించారు. 5కోట్లు అక్రమంగా తీసుకెళ్తుంటే జీఎస్టీ ప్రకారం మంత్రి అనుచరులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అశోక్ ప్రశ్నించారు. 5.27కోట్లకు సంబంధించిన వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేసి.. రాష్ట్రానికి రావాల్సిన పన్నులు వసూలు చేయాలన్నారు.

అధికార వికేంద్రీకరణ అన్నారే తప్ప.. పరిపాలన వికేంద్రీకరణ అనేది ఎక్కడా లేదన్న విషయాన్ని మంత్రి కన్నబాబు తెలుసుకోవాలని పేర్కొన్నారు. మాజీమంత్రి యనమల రాజ్యాంగ ఉల్లంఘనలో నిపుణులైతే.. కోర్టులో వాదించటానికి 5కోట్లు ఖర్చు పెట్టి న్యాయవాదిని ఎందుకు పిలిపించారని అశోక్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చట్టబద్దంగా ఉంటే అసలు న్యాయ వ్యవస్థతో అవసరమేముందని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు, మరణాలు

ABOUT THE AUTHOR

...view details