ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆస్తి పన్ను బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి'

ప్రభుత్వం తీసుకువచ్చిన ఆస్తి పన్ను బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు విశాఖ నగర ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు చెప్పారు. వైకాపాపై పలు విమర్శలు చేసిన వారు ప్రభుత్వ ఖజనాను నింపుకునేందుకు.. ప్రజలపై పన్నులు భారం మోపుతున్నారని విమర్శించారు.

By

Published : Dec 4, 2020, 2:07 PM IST

mla's velagapudi ramakrishna and ganababu
విశాఖ నగర ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు

ఆస్తి పన్నుబిల్లు ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ నగర ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆస్తి పన్ను బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. మండలిలో బిల్లును అడ్డుకొని వెనక్కు పంపితే.. అసెంబ్లీలో రెండు సార్లు ఆమోదించుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.

పేదలకు ఇళ్ళు అన్నీ ఉచితమేనని పాదయాత్రలో చెప్పిన జగన్.. ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. ఇది విశాఖ వాసులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details