కృష్ణా జిల్లా నందిగామ పట్టణ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు తెలిపారు. పట్టణంలోని 5,6,7 వార్డుల్లో ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వార్డులలోని అన్ని వీధుల్లో ద్విచక్రవాహనంపై తిరుగుతూ... మురుగు నీటి పారుదల వ్యవస్థను పరిశీలించారు.
'నందిగామ పట్టణ అభివృద్ధికి కృషిచేస్తాం' - నందిగామలో ఎమ్మెల్యే పర్యటన
నందిగామ పట్టణ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు తెలిపారు. వార్జుల్లో ద్విచక్రవాహనంపై పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు.
నందిగామ పట్టణంలో మురుగునీటి పారుదలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. వార్డులోని ఏ వీధిలో మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చిస్తామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పట్టణంలో చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులపై వివరాలను శానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో డ్రైనేజ్ పూడికతీత, బ్లీచింగ్ చేయటం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు