కృష్ణా జిల్లా మైలవరం స్థానిక పూరగుట్టలో నివేశనా స్థలాల వద్ద జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. 1200 మొక్కలను జడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ తో కలిసి నాటారు. పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. ప్రజా ఆరోగ్యానికి ప్రకృతి దోహదం చేస్తుందని అన్నారు.
'మనం ప్రకృతిని కాపాడితే.. అది మనల్ని కాపాడుతుంది' - mla vasanth planted plants in mylavaram
మనం ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని కృష్ణా జిల్లా మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
మైలవరంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించటం అభినందనీయమని జడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రోహిణి దేవి, ఎంపీడీఓ సుబ్బారావు, ఎఎంసీ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.