విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో మాజీమంత్రి దేవినేని ఉమ అరెస్ట్ ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉమ దీక్షకు కూర్చున్నారు. దీనికి ప్రతీగా వైకాపా శ్రేణులు సైతం అక్కడి చేరుకోవడంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు దేవినేని ఉమను అరెస్ట్ చేశారు.
రాజకీయ ప్రచారం కోసమే దేవినేని రోడ్డెక్కారు: వల్లభనేని - గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
మాజీమంత్రి దేవినేని ఉమ తీరుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా టీవీ డిష్కషన్‌కు రావాలని ఉమకు తెలిపినా.. రాజకీయ ప్రచారం కోసమే రోడ్డెక్కారని మండిపడ్డారు.
MLA VAMSI
మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్టు అనంతరం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గొల్లపూడి చేరుకుని తెదేపాపై విమర్శలు గుప్పించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా టీవీ డిష్కషన్‌కు రావాలని ఉమకు తెలిపినా.. రాజకీయ ప్రచారం కోసమే రోడ్డెక్కారని మండిపడ్డారు.
ఇదీ చదవండి:దేవినేని ఉమ అరెస్టు.. గొల్లపూడిలో టెన్షన్ టెన్షన్