ముఖ్యమంత్రి జగన్ రైతుల పక్షపాతి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రంలో ధాన్యం క్వింటా- గ్రేడ్ ఏ రకం 1888రూపాయలు, సాధారణ రకం 1868 రూపాయలు కనీస మద్దతు ధర కల్పించామన్నారు. మొక్కజొన్న క్వింటాకు 1850 రూపాయలు ఉందని తెలిపారు.
సీఎం జగన్ రైతుల పక్షపాతి: ప్రభుత్వ విప్ ఉదయభాను - ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తాజా వార్తలు
రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
సీఎం జగన్ రైతుల పక్షపాతి: ప్రభుత్వ విప్ ఉదయభాను