ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమానవీయంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు: సింహాద్రి రమేష్ బాబు - krishna district news

కృష్ణానదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన తలశిల హైమావతి మృతదేహాన్ని... అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హైమావతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

nagayalanka women murder
ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతదేహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సింహాద్రి

By

Published : Jul 27, 2020, 4:07 PM IST


కృష్ణానదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన తలశిల హైమావతి మృతదేహాన్ని... అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హైమావతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సమాజంలో మనిషి తోటి మనుషులపై ఆదరణ కలిగి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా కొవిడ్ మృతుల కుటుంబాలు, కరోనా బాధితులను దూరంగా ఉంచుతూ అమానవీయంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకు, ఎమ్మెల్యేగా తనకు సమాచారం అందించాలని సింహాద్రి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details