ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ఎమ్మెల్యేను కలవటానికి వెళ్తున్నారా.. పుస్తకాలు తీసుకెళ్లండి..! - పుస్తకాలు పంచిన ఎమ్యెల్యే సింహాద్రి రమేష్ బాబు

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల నోట్​బుక్స్ అయిపోతే కొత్తవి కొనుగోలు చేయటానికి తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేక... కొందరు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నోట్​బుక్స్ కొరత లేకుండా పోయింది. ఆ విద్యార్థులకు నోట్ బుక్స్ ఎక్కడివి.. ఎలా వస్తున్నాయి.. ఎవరు ఇస్తున్నారు అనుకుంటున్నారా..అయితే ఈ కథనం చదవండి మరీ..!

mla simhadri ramesh babu distributing books new year celebration at avanigadda govt school, krishna district
ఆ ఎమ్మెల్యేను కలవటానికి వెళ్తున్నారా.. పుస్తకాలు తీసుకేళ్లండి..!

By

Published : Jan 6, 2020, 9:15 AM IST

ఆ ఎమ్మెల్యేను కలవటానికి వెళ్తున్నారా.. పుస్తకాలు తీసుకెళ్లండి..!
ప్రజాప్రతినిధిని దగ్గరకు వెళ్ళాలి అనుకునే వారు ఒట్టి చేతులతో వెళ్ళకుండా పూలదండలు, శాలువలు, బొకేలు తీసుకెళ్తుంటారు. అవి సాయంత్రానికి పనికిరాకుండా పోతాయి. వాటిని వృథాగా చెత్తకుప్పలో పడేస్తారు. ఇదంతా చూసిన ఆయనకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే పూల దండలు వేసుకోవడం మానేశారు. ఎందుకలా చేశారు అని అనిపిస్తుంది కదూ..! ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడాలనే సంకల్పం ఆయనది... తనను కలవటానికి వచ్చిన వారితోపాటు తను కలవాల్సిన సందర్భంలో ఇంకొకరికి ఉపయోగపడాలనే ఓ చిన్ని స్వార్ధం ఆయనది. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి బొకేలకు బదులుగా నోట్​బుక్స్ తీసుకోవడం ప్రారంభించారు. వాటిని ప్రభుత్వ బడిలో ఉండే పేద విద్యార్థులకు పంపిణీ చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పటికే సుమారు 30 ప్రభుత్వ పాఠశాలలో సుమారు పదివేల నోట్ బుక్స్, పెన్నులు, బ్యాగ్​లు పంపిణీ చేశారు. ఇదంతా చేసింది మరెవరో కాదు.. కృష్ణా జిల్లా అవనిగడ్డ శాశనసభ్యులు సింహాద్రి రమేశ్‌బాబు. నోట్స్​బుక్స్ మాత్రమే కాకుండా మొక్కలు బహుమతిగా ఇవ్వడం.. వాటిని రోడ్డు పక్కన నాటడం అలవాటుగా మారింది. నూతన సంవత్సరం సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేయటానికి వచ్చే వాళ్ళు సుమారు వెయ్యి వరకు నోట్ పుస్తకాలు, వెయ్యి వరకు పెన్నులు, బ్యాగ్స్ తేవడంతో వాటన్నింటిని అవనిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేశారు. ఇలా పుస్తకాలు, పెన్నులు ఇవ్వడం వలన తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని విద్యార్థులంటున్నారు. అందరూ ఈ విధానాన్నే అనుసరిస్తే... తమ లాంటి పాఠశాల పిల్లలకు నోట్​బుక్స్ కొరతే ఉండదని ఉపాధ్యాయులు తెలిపారు. మంచి పనిని మనమూ ప్రోత్సహిద్దాం.. అనుసరిద్దాం అనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details