కృష్ణాజిల్లా, అవనిగడ్డలో మండల పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనం-మన పరిసరాలు పరిశుభ్రత పక్షోత్సవాలను అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు, మొక్కలను పెంచి సంరక్షించడం ద్వారా ఆరోగ్యకరమైన గాలి, వాతావరణం లభిస్తుందన్నారు. కరోనా పాజిటివ్ కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు, శానిటేషన్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, తహశీల్దార్ మస్తాన్, ఎంపీడీవో లక్ష్మి కుమారి, ఈవో తోట శ్రీనివాస రావుతో పాటు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
పరిశుభ్రత పక్షోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సింహాద్రి - latest avanigadda news
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఎలాంటి రోగాలు దరిచేరక అందరూ ఆరోగ్యంగా ఉంటారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు.
పరిశుభ్రత పక్షోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సింహాద్రి