ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇరికించే ప్రయత్నం జరుగుతోంది.. ఈడీ కేసులకు భయపడను: భారాస ఎమ్మెల్యే - Latest AP Telugu News

MLA Rohith Reddy on ED: ఈడీ కేసులకు తాను భయపడనని భారాస ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కుట్రలో భాగంగానే ఈడీ పరిధిలోకి రాని అంశాన్ని సైతం కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

MLA Rohith Reddy
పైలట్ రోహిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే

By

Published : Dec 27, 2022, 4:21 PM IST

MLA Rohith Reddy on ED: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే.. బీజేపీ కుట్రను తిప్పికొట్టినందుకే తనపై కక్ష్యసాధింపు చర్యలు చేపడుతున్నారని.. భారాస ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి అన్నారు. కుట్రలో భాగంగానే ఈడీ పరిధిలోకి రాని అంశాన్ని సైతం కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈడీ ఎదుట హాజరయ్యే విషయమై న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రోహిత్‌రెడ్డి తెలిపారు.

''ఈడీ ఎదుట హాజరయ్యే విషయం న్యాయవాదులతో చర్చిస్తా. వారి సలహా మేరకు నిర్ణయం తీసుకుంటా. ఈడీ పరిధిలోకి రాని అంశాన్నివిచారిస్తున్నారు. కుట్రలో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగిస్తున్నారు. రేపు రిట్ పిటిషన్‌పై విచారణ జరగనున్న నేపథ్యంలో న్యాయవాదులతో చర్చించి.. ఆ తర్వాత ఈడీ ఎదుట హాజరుకావాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటా. వ్యక్తిగతంగా హాజరుకావాలా.. లేదా తమ ప్రతినిధిని పంపించాలా అనేది న్యాయవాది సూచన మేరకు చేస్తా. అయినా ఇందులో నేరం, మనీల్యాండరింగ్ లేదు. అంతా కుట్ర సాగుతోంది. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఈడీ కేసులకు భయపడను. ధైర్యంగా ఎదుర్కొంటా..''- పైలట్ రోహిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే, తెలంగాణ

పైలట్ రోహిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details