ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంటనే తన నివాసాన్ని చంద్రబాబు ఖాళీ చేయాలి: ఆళ్ల రామకృష్ణారెడ్డి - prajavedika

ప్రజావేదిక కూల్చివేతపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కరకట్ట మీద 60కిపైగా ఖరీదైన భవనాలు ఉన్నాయని, వాటన్నిటికీ నోటీసులు ఇప్పించినట్లు తెలిపారు.

mla ramakrihna

By

Published : Jun 26, 2019, 9:47 AM IST

అక్రమ నిర్మాణాలపై మీడియాతో మాట్లాడుతున్న ఆళ్ల రామకృష్ణ

అక్రమ నిర్మాణాలను తొలగించటంపై ప్రజలంతా హర్షిస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజావేదిక పక్కన ఉన్న ఇంట్లో చంద్రబాబు ఉండటం అన్యాయమని అన్నారు. కరకట్ట మీద 60కి పైగా ఖరీదైన భవనాలు ఉన్నాయన్నారు. ఈ నెల 21న దీనికి సంబంధించిన కేసు న్యాయస్థానం ముందుకు రావాల్సి ఉండగా, చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేశారని ఆరోపించారు. ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా తక్షణమే చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబును తాను వదిలి పెట్టనని స్పష్టం చేశారు. మిగిలిన వాళ్ళు తామంతట తాము ఖాళీ చేస్తే మంచిదని, జగన్ కి ఉన్న మంచి మనసును అంతా గుర్తించాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details