లాక్డౌన్ నిబంధనల ప్రకారం రెడ్‌జోన్ నుంచి గ్రీన్‌జోన్ ఉయ్యూరు వచ్చిన ఎమ్మెల్యే పార్ధసారధిని 15 రోజులు క్వారంటైన్‌కి పంపాలని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. తనతో పాటు తెదేపా నేతలపై నిన్న రాత్రి అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. పోలీసుల అక్రమ కేసులకు భయపడేది లేదని.. నిరంతరం ప్రజాసేవ చేస్తూనే ఉంటామన్నారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడమే తాను చేసిన నేరమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే 100 మంది వైకాపా కార్యకర్తలతో ఉయ్యూరులో రోజూ తిరుగుతూ ప్రచారం చేస్తుంటే.. అతని మీద ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు.
'ఎమ్మెల్యే పార్ధసారధిని 15 రోజులు క్వారంటైన్‌కి పంపాలి' - విజయవాడలో లాక్డౌన్ వార్తలు
రెడ్‌జోన్‌లో ఉన్న విజయవాడ నుంచి గ్రీన్‌జోన్ ఉయ్యూరుకు వచ్చి తిరుగుతున్న ఎమ్మెల్యే పార్ధసారధిని వదిలి.. తనపై కేసులు పెట్టడం అన్యాయమని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆకలితో అల్లాడుతున్న పేదలకు సహాయం చెయ్యడమే తాను చేసిన నేరమా అని నిలదీశారు.
mlc pardhasaradhi