ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక ఎమ్మెల్యే సాయం - ఆముదార్లలంక తాజా వార్తలు

కృష్ణా జిల్లా ఆముదార్లలంకలో శుక్రవారం అగ్నిప్రమాదం జరగ్గా.. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే.. ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

mla help
అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే

By

Published : Mar 13, 2021, 4:37 PM IST

ఈ నెల 12న జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పొయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు హామీఇచ్చారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లలంకలో అగ్ని ప్రమాదానికి గురై సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 వేలతో పాటు నిత్యావసర సరకులు, వంట సామగ్రి, నూతన దుస్తులు అందజేశారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని.. అధైర్య పడవద్దని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details