కృష్ణా జిల్లా ఉయ్యూరు ఎస్సైపై వైకాపా ఎమ్మెల్యే పార్థసారధి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అన్యాయంగా మా వాళ్లను కొడతారా.. అంటూ ఎస్సైపై మండిపడ్డారు. ఇటీవల ఉయ్యూరులో జరిగిన తిరునాళ్ల రోజు.. వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇరు పార్టీల నాయకులు తమ కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా తమను పోలీసులు కొట్టారని.. సెల్ఫోన్లు లాక్కున్నారని వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యేకు వివరించారు.
Viral: ఉయ్యూరు ఎస్సైపై వైకాపా ఎమ్మెల్యే పార్థసారధి వ్యాఖ్యలు.. వైరల్ - krishna district news
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఎమ్మెల్యే పార్థసారధి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే.. స్థానిక ఎస్సైపై కోర్టులో కేసు వేయండని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు.
ఉయ్యూరు ఎస్సైపై వైకాపా ఎమ్మెల్యే పార్థసారధి వ్యాఖ్యలు.. వైరల్
ఈ క్రమంలో పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యే పార్థసారథి.. రాజకీయ గొడవ జరిగితే పోలీసులు ఏ విధంగా కొడతారని ప్రశ్నించారు. ఎస్సైపై కోర్టులో కేసు వేయండని కార్యకర్తలకు సూచించారు. మరోవైపు.. ఈ ఘటనలో ఇప్పటివరకు ఫిర్యాదు రాకపోవటంతో కేసు నమోదు చేయలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి:Ayyanna Case: అయ్యన్నపై తదుపరి చర్యలొద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు