పంట నష్టాన్ని అంచనా వేసి.. నివేదికలు రూపొందించాలని అధికారులను ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ఆదేశించారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గని ఆత్కూరులో నీట మునిగిన పొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి రైతునూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం : ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు - mla visit in gani atkuru
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వివిధ ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గని ఆత్కూరు పొలాలను ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు.
పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే
భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న గృహాలకు ప్రభుత్వ పరిహారం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.