ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్​ నియంత్రణపై నందిగామలో అవగాహనా ర్యాలీ - MLA Mondithoka Jaganmohanarao latest news

కరోనా నియంత్రణపై ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు కృష్ణా జిల్లా నందిగామలో ర్యాలీ నిర్వహించారు. అలాగే నందిగామలో నేటి నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా రాత్రిపూట కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

awareness rally
అవగాహాన ర్యాలీ

By

Published : Apr 29, 2021, 4:00 PM IST

కొవిడ్​ నియంత్రణలో భాగంగా.. కృష్ణా జిల్లా నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ర్యాలీ చేపట్టారు. నేటి నుంచి నందిగామలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని మున్సిపల్ కమిషనర్ జయరామ్ కోరారు. తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు. మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. గుంపులు గుంపులుగా జనం ఉంటే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ జయరామ్, మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ వరలక్ష్మి, నందిగామ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్.. పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details