విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాదయాత్ర నిర్వహించారు. ఎన్నికలకు వైకాపా కలలో కూడా భయపడదని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడి ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన.. సెకండ్ వేవ్ వస్తే ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రభుత్వ పథకాల అవగాహన, పదిహేడు నెలల పాలనలో లోటుపాట్లు తెలుసుకోవటానికే జనం మధ్యకి వస్తున్నామని మల్లాది విష్ణు తెలిపారు.
'ఎన్నికలకు వెళ్లడానికి వైకాపా కలలో కూడా భయపడదు' - ఎమ్మెల్యే మల్లాది విష్ణు తాజా వ్యాఖ్యలు
ఎన్నికలకు వైకాపా కలలో కూడా భయపడదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. విజయవాడ నగరంలోని శ్రీనగర్ కాలనీలో పాదయాత్ర నిర్వహించిన ఆయన.. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాదయాత్ర