ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మల్లాది - mla malladi vishnu launched jagananna vidya kanuka news
జగనన్న విద్యాకానుకతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని పాఠశాలలో విద్యాకానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జగనన్న విద్యాకానుక
విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ ఎమ్కేబేగ్ నగర పురపాలక సంస్థ పాఠశాలలలో జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయలన్నీ కలుగుతాయని చెప్పారు.