విజయవాడలోని కుందా వారి ఖంద్రిక గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. రైతాంగ శ్రేయస్సుకు సర్కారు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చెప్పారు. రైతులకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తోందని తెలిపారు. త్వరలోనే రైతు భరోసా కేంద్రం, పశువుల ఆసుపత్రి శాశ్వత భవన నిర్మాణాలకు నిధులు మంజురయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
కుందావారిఖంద్రికలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - inauguration of grain purchasing center news
విజయవాడ నగర శివారులోని కుందా వారి ఖంద్రిక గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. వైకాపా సర్కారు రైతులకు అన్ని విధాలా చేయూత అందిస్తుందని ఆయన అన్నారు.
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభ కార్యక్రమం