మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. మచిలీపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో పోలీసు అధికారులపై కొల్లు రవీంద్ర దౌర్జన్యం చేశారని.. అందువల్లే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలు తప్పు చేసినా.. వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారన్నారు. పోలీసులను కొల్లు రవీంద్ర బండబూతులు తిడుతూ ఉంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. కొల్లు రవీంద్ర తప్పు చేశారని అందుకే ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంటోందన్నారు.
'కొల్లు రవీంద్రపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది' - ఎమ్మెల్యే జోగి రామేష్ తాజా సమాచారం
తెదేపా నేత కొల్లు రవీంద్రపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎమ్మెల్యే జోగి రామేష్ అన్నారు. పోలీసు అధికారులపై కొల్లు రవీంద్ర దౌర్జన్యం చేశారని.. అందువల్లే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్పష్టం చేశారు.
'కొల్లు రవీంద్రపై చట్టం తన పని తాను చేసుకపోతుంది'