ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అన్నదాతలు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం' - కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో కౌలు రైతు ఆత్మహత్య

కౌలు రైతు ఆత్మహత్య బాధాకరమని.. అన్నదాతలు ఎవరూ అధైర్యపడి బలవన్మరణాలకు పాల్పడొద్దని ఎమ్మెల్యే డా.జగన్ మోహన్ రావు ధైర్యం చెప్పారు. చెవిటికల్లు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు శివరామకృష్ణయ్య కుటుంబసభ్యులను నందిగామ ఆస్పత్రిలో పరామర్శించారు.

tenant farmer committed suicide
అన్నదాతలు అధైర్యపడొద్దు

By

Published : Jan 29, 2021, 5:43 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన రైతు శివరామకృష్ణయ్య..10 ఎకరాలను కౌలుకు తీసుకొని రూ.లక్షల పెట్టుబడి పెట్టి మిర్చి, పత్తి పంటలు సాగుచేశారు. అకాల వర్షాలు, తుపాను కారణంగా సాగులో నష్టం వచ్చింది. చేసిన అప్పు తీర్చలేక ఆవేదన చెందారని స్థానికులు తెలిపారు. మనస్తాపం చెందిన శివరామకృష్ణయ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అధైర్యపడొద్దు..

విషయం తెలుకున్న ఎమ్మెల్యే డా. జగన్ మోహన్ రావు.. నందిగామ ఆస్పత్రికి వెళ్లి మృతుని బంధువులను పరార్శించారు. రైతు ఆత్మహత్య బాధాకరమని. రైతు కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇ్చచారు. అన్నదాతలు అధైర్యపడి బలవన్మరణాలకు పాల్పడొద్దని కోరారు.

ఇదీ చదవండి:అరుదైన వైద్యం చేశారు.. ప్రాణం పోశారు

ABOUT THE AUTHOR

...view details